- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'పెద్ది' నుంచి నెక్స్ట్ ఆ సాంగ్‌ను విడుదల చేయనున్న మేకర్స్
పెద్ది చిత్రం నుంచి మరికొన్ని రోజుల్లో ఐటెం సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ హీరోగా రూపొందిన పెద్ది చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్‌ను జూన్ 3వ తేదీన పెద్ద ఎత్తున ప్రదర్శించనున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో మూవీ బృందం ప్రమోషన్ స్పీడ్ పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రెండు పాటలను, రెండు గ్లింప్స్ వీడియోలను మేకర్స్ విడుదల చేయగా, వాటికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఇక ఈ సినిమా నుంచి నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మూవీ బృందం ఈ సినిమా నుంచి నెక్స్ట్ సాంగ్‌ను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ సాంగ్ ఈ సినిమాలోని ఐటెం సాంగ్ అని సమాచారం. ఈ ఐటెం సాంగ్‌లో శృతిహాసన్, రామ్ చరణ్‌తో కలిసి స్టెప్పులేసింది. అలాగే ఈ నెల 16 లేదా 17 తేదీల్లో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను కూడా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ - రామ్ చరణ్‌కు జోడీగా కనిపించనుండగా, బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.






