- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరో బర్త్‌డే కానుకగా ఆ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్.. పోస్ట్ వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్(Sharwanandh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది ‘మనమే’(Maname) సినిమాతో ఓకే ఓకే అనిపించుకున్న ఆయన ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్(Sharwanandh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది ‘మనమే’(Maname) సినిమాతో ఓకే ఓకే అనిపించుకున్న ఆయన ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాడు. అందులో రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకత్వంలో ‘నారీ నారీ నడుమ మురారీ’(Nari Nari Naduma Murari) ఒకటి. ఈ మూవీలో యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్(Samyuktha Menon), సాక్షి వైద్య(Sakshi Vaidhya) హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బ్యానర్స్ పై అనిల్ సుంకర(Anil Sunkara), రామబ్రహ్మం సుంకర(Ramabrahmam Sunkara) నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు బాలయ్య(Balakrishna) మూవీ టైటిల్ ఫిక్స్ చేయడంతో ఈ చిత్రం పై ఆసక్తి నెలకొంది. కాగా ఈ సినిమాకు విశాల్ చంద్ర శేఖర్(Vishal Chandrashekhar) సంగీతం అందిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. నేడు యంగ్ హీరో శర్వానంద్ పుట్టినరోజు(Birthday) సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు ఎక్స్ (X)వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. ‘రన్ ఎ హెడ్’ అనే కొటేషన్‌తో ఉన్న ఆరెంజ్ కలర్ టీ షర్ట్ వేసుకుని శర్వానంద్ పరుగెడుతున్నాడు. అతనికి రైట్ సైడ్ సాక్షి వైద్య, లెఫ్ట్ సైడ్ సంయుక్త మీనన్ పెరిగెడుతున్నారు. అలాగే బ్యాక్ సైడ్‌లో ఓ పెద్ద కంపెనీ, ఆటో, కార్లు, చెట్లు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా చాలా పేపర్లు గాలిలో ఎగురుతున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






