‘డెకాయిట్’ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఇంట్రెస్టింగ్ పోస్టర్‌తో హైప్ పెంచేశారుగా..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-05-25 14:28:02  IST  )

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్‌(Adivi Shesh) బిగ్ స్క్రీన్ మీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది.

‘డెకాయిట్’ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఇంట్రెస్టింగ్ పోస్టర్‌తో హైప్ పెంచేశారుగా..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్‌(Adivi Shesh) బిగ్ స్క్రీన్ మీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. చివరగా 'హిట్ 2: ది సెకండ్ కేస్'(Hit-2) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో 'డెకాయిట్'(Decoit) ఒకటి. ఇక షనీల్ డియో(Shaneil Deo) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే దీనిని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ(Supriya Yarlagadda) నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీలో అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఇక ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ను మే 26న ఉదయం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘విట్‌నెస్ ద ఫైర్’ అంటూ పోస్టర్‌తో గ్లింప్స్‌తో హైప్ పెంచేశారు.ఇక పోస్టర్‌లో శేష్ ఇంటెన్స్ లుక్‌లో దూరంగా ట్రైన్, కార్ ఫైర్ యాక్సిడెంట‌ని చూస్తూ వెనుక నుంచి కనిపించడం క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Click For Tweet..

Next Story