- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏకంగా అన్ని కోట్ల ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన ‘జన నాయగన్’ మేకర్స్
‘జన నాయగన్’ మేకర్స్ రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులకు 15 కోట్ల ఆఫర్ వచ్చినప్పటికీ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, హెచ్. వినోద్ దర్శకత్వంలో ‘జన నాయగన్’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్గా నటించగా, మమతా బైజు కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్గా నిర్మించారు. ఈ మూవీని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్ కాలేదు. కొన్ని రోజుల క్రితం తమిళనాడులో జరిగిన ఎన్నికలలో విజయ్ పార్టీ అద్భుతమైన రీతిలో విజయాన్ని అందుకుంది. దాంతో ప్రస్తుతం విజయ్ తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
విజయ్ ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో ఈ సినిమా ఎలాంటి సమస్యలు లేకుండా విడుదల అవుతుందని ప్రేక్షకులు క్లారిటీకి వచ్చారు. ఈ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కుల కోసం నాగవంశీతో పాటు పలువురు 15 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఈ మూవీ మేకర్స్ మాత్రం 33 కోట్ల వరకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ‘భగవంత్ కేసరి’ చిత్రానికి రీమేక్ అని ఈ మూవీ ట్రైలర్ ద్వారా క్లియర్‌గా అర్థమవుతోంది. తెలుగు రీమేక్ చిత్ర హక్కులను 33 కోట్లకు కొనుగోలు చేయడం పెద్ద రిస్క్ అవుతుందని చాలామంది సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఎన్ని కోట్ల బిజినెస్ జరుగుతుందో అనేది ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిగా మారింది.






