- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ఫస్ట్ లుక్‌ను రివీల్ చేసిన మేకర్స్.. వైల్డ్ లుక్‌లో షాకిస్తున్న యంగ్ హీరో
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య(Naga Shourya), రామ్ దేసిన(Ram Desina) కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య(Naga Shourya), రామ్ దేసిన(Ram Desina) కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీ వైష్ణవి ఫిలీం బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి(Srinivasa rao Chintalapudi) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి హరీస్ జయరాజ్(Harris Jayaraj) మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే నేడు(బుధవారం) నాగశౌర్య పుట్టిన రోజు(Birthday) కావడంతో ఈ మూవీ టైటిల్‌తో పాటు హీరో ఫస్ట్‌లుక్‌ను రివీల్ చేశారు. ఇందులో భాగంగా ఈ చిత్రానికి ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’(Bad Boy Karthik) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక ఫస్ట్ లుక్(First Look) పోస్టర్‌ను గమనించినట్లయితే.. రెబల్లియస్ అవతారంలో నాగశౌర్య వ్యాన్ బ్యాక్ సైడ్‌లో కూర్చొని సీరియస్‌గా చూస్తున్నాడు. అలాగే చేతి నిండా రక్తం, ఆ బ్లడ్‌ను నుదుటున అడ్డంగా గోవింద నామాలు పెట్టుకొని ఉన్నాడు. అయితే వ్యాన్ నెంబర్ ప్లేట్ మీద HYDERABAD అని రాసి ఉంటే BAD అనే పదం మాత్రం చెరిపేసి ఉంది. ఇక ఈ పోస్టర్‌ను గమనించినదాన్ని బట్టి చూస్తుంటే నాగశౌర్య ఫుల్ ఆఫ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది.






