మోత మోగాల్సిందే.. ‘జటాధర’ నుంచి సూపర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

by Chukka Sudharani |

సుధీర్ బాబు, వెంకటేష్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూవీ ‘జటాధర’.

మోత మోగాల్సిందే.. ‘జటాధర’ నుంచి సూపర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: సుధీర్ బాబు, వెంకటేష్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూవీ ‘జటాధర’. డివోషనల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో రాబోతుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా కాగా.. ఈ ఏడాది నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. మూవీ నుంచి వరుస అప్డేట్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే మ్యూజికల్ జర్నిలో రెండు సాంగ్స్ రిలీజ్ చెయ్యగా.. తాజాగా మూడో సాంగ్ అప్డేట్ ఇచ్చాడు. ఈ మేరకు ‘వేడిని పెంచండి.. ‘ట్రెండ్ సెట్ చెయ్యి పిల్లోడా’తో ఉత్సాహంగా ఉండటానికి సిద్ధంగా ఉండండి.. పార్టీ సాంగ్ అక్టోబర్ 15న రాబోతున్నది’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లోని సౌండ్ బాక్స్ సెట్టింగ్స్ చూస్తుంటే.. మోత మోగాల్సిందే అన్నట్లుగా ఈ సాంగ్ ఉండబోతున్నట్లు అర్థం అవుతున్నది. లింక్

Next Story