‘థగ్‌లైఫ్’ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. స్టార్ హీరోయిన్ పోస్టర్ విడుదల

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-02 15:38:59  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan), శింబు(simbu) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘థగ్‌లైఫ్’(Thuglife).

‘థగ్‌లైఫ్’ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. స్టార్ హీరోయిన్ పోస్టర్ విడుదల
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan), శింబు(simbu) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘థగ్‌లైఫ్’(Thuglife). మణిరత్నం(Maniratnam) దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇందులో త్రిష, సన్యా మల్హోత్రా(Sanya Malhotra), గౌతమ్ కార్తీక్, ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi), నాజర్, జోజు జార్ట్, కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా జూన్ 5న థియేటర్స్‌లోకి రానుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇక ‘థగ్‌లైఫ్’ విడుదల దగ్గర పడటంతో చిత్రబృందం ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఈ మూవీకి సంబంధించిన సెకండ్ సింగిల్ ‘షుగర్ బేబీ’ మే 21న రానున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ మూవీ ఆడియో లాంచ్ మే 24న జరగనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా నోట్లు పైకి ఎగురుతుండగా.. తెల్ల చీరలో త్రిష మెరిసిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది.

Click For Video....

Next Story