- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కుబేర’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఊహించని అప్డేట్ రాబోతుందంటూ హైప్ పెంచుతున్న ట్వీట్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush), అక్కినేని నాగార్జున(Nagarjuna) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush), అక్కినేని నాగార్జున(Nagarjuna) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’. శేఖర్ కమ్ముల(Shekhar Kammula) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమాను అమిగోస్ క్రియేషన్స్ సంస్థపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. అయితే ఈ మూవీ భారీ అంచనాల మధ్య జూన్ 20న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ బాషల్లో రిలీజ్ కాబోతుంది. కానీ షూటింగ్ పూర్తి కానందున వాయిదా పడే అవకాశం ఉన్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో.. తాజాగా, చిత్రబృందం స్పందించిన ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ఈ సినిమా అనుకున్న విధంగానే జూన్ 20న విడుదల కాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అలాగే ‘కుబేర’ TranceOfKuberaa థీమ్ సాంగ్ మే 25న రాబోతున్నట్లు తెలుపుతూ అక్కినేని నాగార్జున పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ పోస్ట్‌కు ‘‘రాజు లాంటి వైభవం కొనసాగుతోంది..ఇందకు ముందు ఎప్పుడూ చూడనిది రాబోతుంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇక ఈ పోస్టర్‌లో నాగ్ ఫేస్ మాత్రమే కనిపిస్తుండగా.. వెనకాల వైపు రోడ్‌పై నడుస్తున్న ఓ వ్యక్తి పెద్ద పెద్ద భవనాల వైపుకు వెళ్తున్నట్లుగా చూపించారు. ప్రస్తుతం ఈ ఫొటో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.
A king-sized glory continues 👑Congratulations to KING @iamnagarjuna garu on completing 39 blockbuster years in Indian film industry ♥️The world will be drawn into a trance by your presence in #TranceOfKuberaa from May 25th! ✨#Kuberaa In Cinemas 20th June, 2025.… pic.twitter.com/567FS2XKyE
— Kuberaa Movie (@KuberaaTheMovie) May 23, 2025






