‘జాక్’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ‘పబ్‌లో నెరుడా’ వచ్చేది అప్పుడే అంటూ ఆసక్తికర పోస్ట్

by I. Sairam |

‘జాక్’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ‘పబ్‌లో నెరుడా’ వచ్చేది అప్పుడే అంటూ ఆసక్తికర పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: రీసెంట్‌గా ‘టిల్లు స్క్వేర్’(Tillu Square) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) మనందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఆయన బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) డైరెక్షన్‌లో ‘జాక్-కొంచెం క్రాక్’(Jack Koncham Crack) సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇందులో యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ప్రముఖ నిర్మాత బి వి ఎస్ ఎన్ ప్రసాద్(BVSN Prasad) నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇక ఇందులో ప్రకాష్ రాజ్(Prakash Raj), బ్రహ్మాజీ(Brahmaji) వంటి వారు కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కాగా ఈ మూవీకి అచ్చు రాజమణి(Achu Rajamani) స్వరాలు సమకూర్చారు. అయితే ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ మొదలు పెట్టిన మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు.

ఇందులో భాగంగా తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘ది యాటిట్యూడ్ అండ్ వైబ్.. ఇదంతా జాక్- ఇంగ్ అప్.. జాక్ ఫస్ట్ సింగిల్ పబ్‌లో నెరుడా మార్చి 7న రాబోతుంది’ అని రాసుకొచ్చారు. అలాగే ‘అచ్చు రాజమణి నుండి ఒక మ్యూజికల్ బ్యాంగర్ చూడండి’ అని పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story