‘ది గర్ల్ ఫ్రెండ్’ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుందంటూ క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్.. స్టార్ యాక్టర్ పోస్టర్‌‌తో హైప్ పెంచేశారుగా..

by I. Sairam |   (  Updated:2025-06-23 08:06:39  IST  )

నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకుపోతుంది.

‘ది గర్ల్ ఫ్రెండ్’ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుందంటూ క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్.. స్టార్ యాక్టర్ పోస్టర్‌‌తో హైప్ పెంచేశారుగా..
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకుపోతుంది. ‘కుబేర’ సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె ఇప్పుడు టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి(Dheekshith Shetty) సరసన ‘ది గర్ల్ ఫ్రెండ్’(The Girlfriend) అనే సినిమాలో నటిస్తోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్(Geetha Arts), మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని(Dheeraj Mogilineni) ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) రూపొందిస్తున్నారు.

ఇక దీనికి ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన అప్డేట్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా, ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా నుంచి మేకర్స్ అప్డేట్‌ను విడుదల చేశారు. ఈరోజు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ పుట్టిన రోజు సందర్భంగా అతనికి విష్ చేస్తూ ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ జూలై నెలలో రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా డైరెక్టర్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story