‘అమ్మ పాలు లేక రక్తం పోసి పెంచిన కథ’.. ‘ది ప్యారడైజ్’ మూవీ బిగ్ అప్డేట్‌‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన మేకర్స్..

by Mallepaka Hamsa |   (  Updated:2025-03-04 12:16:44  IST  )

నేచురల్ స్టార్ నాని(Nani) వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. హాయ్ నాన్న, దసరా, సరిపోదా శనివారం వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు.

‘అమ్మ పాలు లేక రక్తం పోసి పెంచిన కథ’.. ‘ది ప్యారడైజ్’ మూవీ బిగ్ అప్డేట్‌‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన మేకర్స్..
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని(Nani) వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. హాయ్ నాన్న, దసరా, సరిపోదా శనివారం వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం నాని హిట్-3, ది ప్యారడైజ్ వంటి మూవీస్ చేస్తున్నారు. అయితే ‘ది ప్యారడైజ్’(The Paradise) కోసం మరోసారి శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)తో వర్క్ చేయబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘దసరా’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోయింది. భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

మొత్తం ఎనిమిది భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం, క‌న్నడ‌, బెంగాలీ, ఇంగ్లీష్‌, స్పానిష్ భాష‌ల్లో రానుంద‌ట‌. 1960 బ్యాక్ డ్రాప్‌లో ఈ చిత్రం తెర‌కెక్కుతున్నట్లు సమాచారం. ఇందులో నాని తల్లిపాత్రలో సోనాలి కులకర్ణి(Sonali Kulkarni) కనిపించబోతుంది. అయితే ‘ది ప్యారడైజ్’కు సంబంధించిన షూటింగ్ మొదలవగా.. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలై అందరిలో అంచనాలను రెట్టింపు చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘ది ప్యారడైజ్’ సినిమాకు సంబంధించిన డబుల్ అప్డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ఈ సినిమా గ్లింప్స్ విడుదల చేయడంతో పాటు 2026 మార్చి 26న విడుదల కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా నాని పోస్టర్‌తో హైప్ పెంచారు.

ఇందులో ఆయన రెండు జడలు వేసుకుని ముక్కు పోగులు గడ్డం, మీసాలతో ఒళ్లంతా కలర్ పూసుకుని ఉండగా.. రెక్కలు ఉన్నట్లుగా కనిపించారు. ఇక గ్లింప్స్ విషయానికొస్తే.. చరిత్రలో అందరూ చిలకలు, పావురాలు గురించి రాసి ఉంటారు గానీ, కానీ అదే జాతిలో కాకుల గురించి రాయలేదు. ఇది కడుపు మండిన కాకుల కథ.. జమాన జమాన నడిచే శవాల స్టోరీ. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఓ జాతి కథ. ఒక ధగడ్ వచ్చి మొత్తం జాతిలో జోష్ తెచ్చిండు. కాకులను ఒక్కటి చేసిన లంజా కొడుకు కథ’’ అంటూ సాగే పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ అందరిలో క్యూరియాసిటీని పెంచాయి. అలాగే ఇందులో నాని యాక్షన్స్‌తో అదరగొట్టేశాడు.

Next Story