Akkineni Akhil: ‘లెనిన్’ క్లైమాక్స్‌ను ఊహించని విధంగా ప్లాన్ చేస్తున్న మేకర్స్.. హైప్ పెంచుతున్న ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-22 12:29:16  IST  )

అక్కినేని అఖిల్(Akhil) చివరగా ‘ఏజెంట్’(Agent) సినిమాలో నటించాడు. అయితే ఈ మూవీ 2023లో విడుదలై బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

Akkineni Akhil: ‘లెనిన్’ క్లైమాక్స్‌ను ఊహించని విధంగా ప్లాన్ చేస్తున్న మేకర్స్.. హైప్ పెంచుతున్న ట్వీట్
X

దిశ, సినిమా: అక్కినేని అఖిల్(Akhil) చివరగా ‘ఏజెంట్’(Agent) సినిమాలో నటించాడు. అయితే ఈ మూవీ 2023లో విడుదలై బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం అక్కినేని హీరో ‘లెనిన్’ (Lenin)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మురళీ కిశోర్ అబ్బూరు(Murali Kishore Abburu) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios), సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఇందులో అఖిల్ సరసన క్రేజీ బ్యూటీ శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే ‘లెనిన్’ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.

అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘లెనిన్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూన్ ఫస్ట్ వీక్‌లో ‘లెనిన్’ క్లైమాక్స్ సీన్స్ షూట్ చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం కొన్ని ప్రత్యేక స్టంట్స్‌ను కూడా డిజైన్ చేశారట. అయితే ఈ స్టంట్ సిక్వెన్స్‌ను మరింత ఫర్‌ఫెక్ట్‌గా స్క్రీన్‌పై కనిపించడం కోసం అఖిల్ ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నట్లు టాక్. ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ ‘లెనిన్’ సినిమా మొత్తానికి హైలెట్‌గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Click For Tweet..

Next Story