కర్ణాటకలో ‘థగ్‌లైఫ్’‌కు లైన్ క్లియర్.. సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు

by Kema Shiva Kumar |

విలక్షణ నటుడు కమల్‌హాసన్ (Kamal Hasan) నటించిన ‘థగ్‌లైఫ్‌’ (Thug Life) మూవీని కర్ణాటక (Karnataka)లో నిషేధించాలంటూ ఇటీవలే కేఎఫ్‌సీసీ (Karnataka Film Chamber of Commerce) హైకోర్టు (High Court)లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

కర్ణాటకలో ‘థగ్‌లైఫ్’‌కు లైన్ క్లియర్.. సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: విలక్షణ నటుడు కమల్‌హాసన్ (Kamal Hasan) నటించిన ‘థగ్‌లైఫ్‌’ (Thug Life) మూవీని కర్ణాటక (Karnataka)లో నిషేధించాలంటూ ఇటీవలే కేఎఫ్‌సీసీ (Karnataka Film Chamber of Commerce) హైకోర్టు (High Court)లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమ్రంలోనే సెన్సార్ పూర్తి చేసుకుని ఈ నెల 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సినిమాను ఒక్క కర్ణాటక స్టేట్‌లోనే కుట్రపూరితంగా నిషేధించారంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో చిత్ర నిర్మాత పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్‌పై జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా (Justice Prashant Kumar Mishra), జస్టిస్ మన్మోహన్‌ (Justice Manmohan)తో కూడిన ధర్మసనం విచారణ చేపట్టి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి నేటి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు మరోసారి అదే పిటిషన్‌పై ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. కమల్‌హాసన్ మెయిన్ రోల్‌లో నటించిన ‘థగ్‌లైఫ్‌’ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో కర్ణాటకలో విడుదల చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. మూవీ విడుదలను అడ్డుకునేందుకు ఎవరికీ అధికారంలో లేదని స్పష్టం చేసింది.

Next Story