- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐదు నిమిషాల ఆ పని కోసం రూ.5 కోట్లు తీసుకుంటున్న లేడీ సూపర్ స్టార్..
స్టార్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘గజిని’(Gajini) మూవీతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది ఆ తర్వాత ‘లక్ష్మీ’(Lakshmi) మూవీతో భారీ హిట్ అందుకుంది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు స్టార్ హీరోయిన్ రేంజ్‌లో ఎదుగుతుంది. ఇక రీసెంట్‌గా అనిల్ రావిపూడి(anil Ravipudi) దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Varaprasad Garu) మూవీతో మన ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది.
మరోపక్క రాకింగ్ స్టార్ యష్(Yash) నటిస్తున్న ‘టాక్సిక్’(Toxic) మూవీలో గంగ పాత్రలో అలరించనుంది. అలాగే ‘అమ్మోరు తల్లి-2’(Ammoru Thalli-2) సినిమాలో కూడా యాక్ట్ చేస్తుంది. అలా సినిమాలతో పాటు ఫ్యామిలీ లైఫ్‌ను కూడా లీడ్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ చిన్నదానికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ చిన్నది టాటా స్కై(TATA Sky) యాడ్‌లో 5నిమిషాలు నటించడానికి రూ.5 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం ఐదు నిమిషాలకు అంత మనీ తీసుకుంటుందంటే ఈ అమ్మడు రేంజ్ ఏంటో ఇక్కడే తెలిసిపోతుంది. ప్రస్తుతం ఇందుకు సంబందించిన న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.
Read More..






