- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
బాలీవుడ్‌లో ‘కుంభమేళా మోనాలిసా’ లాంటి కళ్లున్న హీరోయిన్.. ఫొటోస్ వైరల్

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాను అతిగా వాడుతున్న నెటిజన్లకు కుంభమేళా(Mahakumbh 2025) బ్యూటీ మోనాలిసా(Monalisa) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఇలా ఏది ఓపెన్ చేసినా ఆమె ఫొటోలే దర్శనమిస్తున్నాయి. ఆమె కలర్ నలుపుగా ఉన్నా.. ఆమె కళ్లు, స్మైల్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కుంభమేళాలో పుణ్య స్నానాలకు వెళ్లే భక్తులతో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంతా తప్పకుండా ఆమె వద్దకు వెళ్లి ఫొటోనో, వీడియోను తీసుకొని నెట్టింట్లో పోస్టు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. కుంభమేళా బ్యూటీ మోనాలిసా లాంటి కళ్లున్న బాలీవుడ్ హీరోయిన్ వామికా గబ్బి(Wamiqa Gabbi)ని వైరల్ చేస్తున్నారు. వారిద్దరి ఫొటోలు పక్క పక్కన ఎడిట్ చేసి పోస్టులు చేస్తున్నారు. దీంతో ఇద్దరూ సేమ్ ఉన్నారని కొందరు.. చాలా తేడాలున్నాయని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కాగా, వరుణ్ దావన్ హీరోగా నటించిన బేబీ జాన్ సినిమాలో వామిక గబ్బి నటించింది. ఇందులో మరో హీరోయిన్‌గా కీర్తి సురేష్ కీలక పాత్ర పోషించింది. కానీ, అనుకున్నంత రేంజ్‌లో ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది. కానీ వామిక గబ్బి యాక్టింగ్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.