- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకున్న కిల్లర్ మూవీ.. ఫైనల్‌గా హీరోయిన్ క్రేజీ ఫొటోస్ షేర్ చేసి హైప్ పెంచేశారుగా..
సీరియల్ నటి జ్యోతి రాయ్(Jyothi Roy)కి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: సీరియల్ నటి జ్యోతి రాయ్(Jyothi Roy)కి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ‘గుప్పెడంత మనసు’(Guppedantha Manasu) సీరియల్‌లో జగతి(Jagathi) పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. ఆ సీరియల్ ఆ రేంజ్‌లో హిట్ కావడానికి జ్యోతి పాత్ర కూడా ఓ కారణం. తల్లి పాత్ర చేసేంత వయసు లేకపోయినా హీరోకి అమ్మగా తనదైన నటనతో అలరించింది. ఇక సీరియల్‌కి మధ్యలో గుడ్‌బై చెప్పేసి సినిమలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కిల్లర్’(Killer). ఇక ఈ చిత్రాన్ని జ్యోతి రాయ్ లవర్ పూర్వజ్(Poorvaj) డైరెక్ట్ చేస్తున్నారు.
ఇక ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో విశాల్ రాజ్, గౌతమ్‌లు కూడా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు హీరోయిన్ జ్యోతి రాయ్ స్టన్నింగ్ ఫొటోస్‌ను షేర్ చేస్తూ.. ‘విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకున్నందుకు కిల్లర్ మొత్తం బృందానికి పెద్ద చీర్స్. దర్శకుడు పూర్వజ్ మరియు పవర్‌హౌస్ పెర్ఫార్మర్ జ్యోతి రాయ్‌కి శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చారు. ఇక షేర్ చేసిన ఫొటోస్‌లో జ్యోతి రాయ్ సీరియస్‌గా ఫైటింగ్ చేస్తున్నట్లు స్టిల్స్ ఇచ్చింది. Link






