అల్లు అర్జున్‌తో చేసిన ఇంటర్వ్యూ నాకు సెకెండ్ ఇన్నింగ్స్ లాంటిది.. నటి స్రవంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |

ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపు(Sravanthi Chokkarapu).. ప్రజెంట్ మూవీ ప్రమోషన్స్‌తో మరింత ఫేమస్ అయ్యింది.

అల్లు అర్జున్‌తో చేసిన ఇంటర్వ్యూ నాకు సెకెండ్ ఇన్నింగ్స్ లాంటిది.. నటి స్రవంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపు(Sravanthi Chokkarapu).. ప్రజెంట్ మూవీ ప్రమోషన్స్‌తో మరింత ఫేమస్ అయ్యింది. ఎక్కువగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రముఖులతో ఇంటర్వ్యూలు, సినిమా ఫంక్షన్లలో యాంకర్ గా బిజీబిజీగా గడిపేస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియా(Social Media)లోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెంచుకుంటుంది. ఇక ఈ భామ ప్రజెంట్ సుహాస్(Suhas) హీరోగా నటిస్తున్న ‘హే భగవాన్’(Hey Bhagavan) సినిమాలో నటిస్తోంది. గోపి అచ్చర(Gopi Achara) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శివాని నాగారం(Shivani Nagaram) హీరోయిన్‌గా నటిస్తోంది.

త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్ పై బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్న ఆ సినిమాకు వివేక సాగర్ సంగీతాన్ని సమకూర్చారు. ఇక వెన్నెల కిశోర్, సుదర్శన్, అన్నపూర్ణమ్మ వంటి ప్రముఖులు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 20న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న స్రవంతి అక్కడ ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ‘అల్లు అర్జున్ గారితో ఇంటర్వ్యూ చేయడానికి వాళ్ళు చెప్పిన హోటల్‌కి నేను ఉదయం 11గంటలకు వెళ్ళాను. అయితే అక్కడ ఇంటర్వ్యూకు అల్లు అర్జున్, రష్మిక మందన్న, సుకుమార్, దేవిశ్రీ ప్రాసాద్‌లు వచ్చారు.

అయితే ఒక ఇంటర్వ్యూ మంజూష చేశారు. దీని తర్వాత వాళ్ళు బిగ్ బాస్‌కు ప్రమోషన్స్‌కు వెళ్లాలి. అయితే నాతో ఇంటర్వ్యూ అంటే చూద్దామన్నట్టు చెప్పారు. అందుకని నేను మార్నింగ్ 11కి వెళితే నైట్ 12 వరకు అప్పుడు వస్తారు ఇప్పుడు వస్తారు అని అలాగే వెయిట్ చేశాను. అప్పుడు వాళ్ళు 12కి వచ్చారు. ఆ టైమ్‌లో నాకు ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాగా అలిసిపోయి వచ్చారు. కానీ నా కోసం వాళ్లు ఇంటర్వ్యూ ఇచ్చారు. 20 నిమిషాలు అనుకున్న ఇంటర్వ్యూ గంటన్నర పాటు జరిగింది. అప్పటినుంచి నేను బన్నీకు బర్త్‌డే విష్ చేయడం, సినిమాల విషయంలో మాట్లాడుతూనే ఉంటాను. నా లైఫ్‌లో అల్లు అర్జున్ గారితో చేసిన ఇంటర్వ్యూ నాకు సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Next Story