- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీ చాలా మారింది... అప్పట్లో అలాంటి సినిమాలే చేసేవాళ్ళం.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన వడ్డే నవీన్
వడ్డే నవీన్ మాట్లాడుతూ, “నేను, శ్రీకాంత్, జగపతిబాబు, వెంకటేష్ గారు ఇలా అప్పట్లో ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా చేసేవాళ్లం” అని ఆయన చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: దాదాపు 10 ఏళ్ల గ్యాప్ తర్వాత వడ్డే నవీన్ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రాన్ని జూన్ 19న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వడ్డే నవీన్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయనకు “ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కు పెద్దగా రావడం లేదని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?” అనే ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందించిన నవీన్, “మా సమయంతో పోలిస్తే ఇప్పుడు ఇండస్ట్రీ చాలా మారిపోయింది.
ఒకప్పుడు ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలే చేసేవారు. నేను, శ్రీకాంత్, జగపతిబాబు, వెంకటేష్ గారు వంటి చాలామంది హీరోలు ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వచ్చాం. ఇప్పుడు అనేక మంది కొత్త నటులు వచ్చారు. కొత్త జానర్‌లలో సినిమాలు రూపొందిస్తున్నారు. ఇప్పటి సినిమా ఇండస్ట్రీ చాలా బాగుంది” అని తెలిపారు. ఇక ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రానికి కమల్ తేజ నార్ల దర్శకత్వం వహిస్తుండగా, వడ్డే నవీన్ తన సొంత బ్యానర్ ‘వడ్డే క్రియేషన్స్’పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ బ్యూటీ రాశి సింగ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.






