Brahma Anandam : ఆక‌ట్టుకుంటోన్న " బ్రహ్మా ఆనందం " ట్రైలర్

by Phanindra |   (  Updated:2025-08-15 17:39:05  IST  )

రాజా గౌతమ్ హీరోగా తెరకెక్కిన మూవీ " బ్రహ్మా ఆనందం "

Brahma Anandam  : ఆక‌ట్టుకుంటోన్న  బ్రహ్మా ఆనందం   ట్రైలర్
X

దిశ, వెబ్ డెస్క్ : రాజా గౌతమ్ ( Raja Goutham ) హీరోగా తెరకెక్కిన మూవీ " బ్రహ్మా ఆనందం " ( Brahma Anandam ). రియల్ లైఫ్ లో తండ్రీ కొడుకులైన బ్ర‌హ్మానందం, గౌత‌మ్ లు వెండితెర‌పై తాత, మ‌నవ‌డిగా కనిపించనున్నారు. ఆర్‌.వి.ఎస్ నిఖిల్ ఈ మూవీకి డైరెక్షన్ చేయగా.. వెన్నెల కిశోర్‌, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌ ముఖ్య పాత్రలను పోషించారు. స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై రాహుల్‌ యాదవ్‌ నక్కా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 14న‌ ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మూవీ మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. దానిలో భాగంగానే తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 2 నిమిషాల 34 సెక‌న్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ అందర్ని ఆక‌ట్టుకుంటోంది.

వెన్నెల కిశోర్, గౌత‌మ్‌ల కామెడీ సినిమాకే హైలెట్ గా నిలవనుంది. " బ్ర‌హ్మానందం " ఈ చిత్రంలో తన నట విశ్వరూపం చూపించారు. ఎంట్రీతో పాటు సీన్స్ కూడా చాలా బాగున్నాయి. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమా పై అంచ‌నాల‌ను భారీగా పెంచేసింది. ఈ కోసం ఆడియెన్స్ ఎంతోగానో ఎదురుచూస్తున్నారు.

Next Story