ఓటీటీలో దూసుకుపోతున్న ‘సమ్మేళనం’ వెబ్‌సిరీస్.. ఎందులో చూడొచ్చంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2025-02-21 03:39:00  IST  )

గత కొద్ది రోజుల నుంచి ఓటీటీ ట్రెండ్ కొనసాగుతోంది. థియేటర్స్‌లో మెప్పించలేని సినిమాలు సైతం ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలుస్తున్నాయి.

ఓటీటీలో దూసుకుపోతున్న ‘సమ్మేళనం’ వెబ్‌సిరీస్.. ఎందులో చూడొచ్చంటే?
X

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి ఓటీటీ ట్రెండ్ కొనసాగుతోంది. థియేటర్స్‌లో మెప్పించలేని సినిమాలు సైతం ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా వెబ్‌సిరీస్‌ల గురించి చెప్పనక్కర్లేదు. యూత్‌ను ఫిదా చేసే కంటెంటె‌తో పలు వెబ్‌సిరీస్‌లు తెరకెక్కుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మరి కొన్ని రియల్ స్టోరీల ఆధారంగా తీసుకువస్తూ మేకర్స్ జనాలను మంత్రముగ్దులను చేస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రేమ, స్నేహం, బ్రేకప్ వంటి అంశాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఇక ఇలాంటి కాన్సెప్ట్‌లతో తీసే సినిమాలైనా, వెబ్ సిరీస్‌లైనా కూడా అందరినీ అలరిస్తుంటాయి. అయితే ఇలాంటి సున్నితమైన అంశాలతో చేసిన ‘సమ్మేళనం’(Sammelanam) సిరీస్ ఈటీవీ విన్‌లోకి వచ్చింది. ఫిబ్రవరి 20 నుంచి ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఇద్దరు స్నేహితులు ఒక అమ్మాయిని ప్రేమించడం వల్ల ఏం జరిగిందనేది చూపించారు. ఓ ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో వచ్చి అందరిలో క్యూరియాసిటీ పెంచారు. కాగా ఇలాంటి సంఘటనలు సమాజంలోనూ ఎన్నో చోటుచేసుకుంటున్నాయి.

అయితే గత కొద్ది రోజుల నుంచి అమ్మాయిలు ఒకరితో కాకుండా ఇద్దరి ముగ్గురిని లవ్ చేయడం వంటి సంఘటలు ఎన్నో జరుగుతున్నాయి. అలాగే ఇద్దరు ఫ్రెండ్స్ ఓకే అమ్మాయిని లవ్ చేసి కొట్టుకోవడం వంటి సంఘటనలు ఎన్నో దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇలాంటి సంఘటనల తర్వాత కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. మరికొందరు మాత్రం స్నేహం కోసం తమ ప్రేమను త్యాగం చేయడంతో పాటు జీవితాన్ని కూడా దారపోస్తుంటారు. ఇక వాటన్నింటి ఆధారంగా ఈ సిరీస్ తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఇందులో ఎటువంటి అడల్ట్ కామెడీ కి తావు లేకుండా క్లీన్ కమెడీతో దర్శకుడు తరుణ్ మహదేవ్ ఈ సీరీస్‌ను చక్కగా మలిచాడనే చెప్పాలి.. ఈ వారాంతంలో చూసేయదగ్గ లిస్ట్ లో సమ్మేళనం ముందు వరుసలో ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌ ఓటీటీలో బాగానే ట్రెండ్ అవుతోంది. కాగా, ఇందులో తరుణ్ మహాదేవ్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో ‘హుషారు’ఫేమ్ ప్రియా వడ్లమాని(Priya Vadlamani), గణాదిత్య, బిందు, శివాంత్, విష్నుయ్ అభిషేక్ నటించారు.

Next Story