మరోసారి హిట్ కాంబో రిపీట్.. ‘ధమాకా’ సినిమాను మించి ఉంటుందంటూ హైప్ పెంచిన డైరెక్టర్

by Mallepaka Hamsa |

మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) ఫ్లాప్, హిట్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు.

మరోసారి హిట్ కాంబో రిపీట్.. ‘ధమాకా’  సినిమాను మించి ఉంటుందంటూ హైప్ పెంచిన డైరెక్టర్
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) ఫ్లాప్, హిట్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ‘మాస్ జాతర’(Mass Jatara) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భాను భోగవరపు(Bhanu Bhogavarapu) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ మే 9న థియేటర్స్‌లోకి రానుంది. ఈ క్రమంలో.. తాజాగా, రవితేజ హిట్ సినిమాకు సీక్వెల్ రానున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. త్రినాథ రావు నక్కిన, రవితేజ కాంబోలో వచ్చిన ‘ధమాకా’ సినిమాకు సీక్వెల్ రానున్నట్లు టాక్. మరోసారి హిట్ కాంబో రిపీట్ కానున్నట్లు పలు పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ఇప్పటికే త్రినాథ రావు స్టోరీ చెప్పగా.. దానికి రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ విషయంపై స్పందించిన డైరెక్టర్ ‘ధమాకా-2’ టైటిల్‌ను కూడా రివీల్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ‘‘సందీప్ కిషన్ మజాకా సినిమాకు కూడా సీక్వెల్ అనుకున్నాము. ‘డబుల్ మజాకా’ అనే టైటిల్ ఫిక్స్ చేశాం. అయితే మూవీ చివర్లో టైటిల్ వేద్దాం అనుకున్నాం కానీ పలు కారణాల వల్ల ఆపేశాం. అలాగే రవితేజ గారికి ఒక కథ చెప్పాను ఆయన ఓకే అన్నారు. అది ‘ధమాకా’ను మించి ఉంటుంది. దానికి కూడా ‘డబుల్ ధమాకా’ అనే టైటిల్ అనుకుంటున్నాము. ఈ రెండు ప్రాజెక్ట్స్‌లో ముందు ఏది చేస్తానా అనేది నిర్మాతలతో మాట్లాడి డిసైడ్ అవ్వాలి. మా కాంబోలో ‘ధమాకా’ సీక్వెల్ వచ్చినా రాకున్నా ఓ సినిమా ఖచ్చితంగా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు.

Next Story