- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ ఉదయం అతను నన్ను ఇలా ఆశ్చర్య పరిచాడంటూ బాబు ఫొటోను షేర్ చేసిన ఆ హీరో భార్య.. తండ్రికి తగ్గ కొడుకు అని కామెంట్స్
‘రాజావారు రాణిగారు’(Raja Vaaru Ranivaru) సినిమాతో హీరోయిన్‌గా ప్రేక్షకులకు పరిచయం అయిన రహస్య గోరఖ్(Rahasya Gorak) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: ‘రాజావారు రాణిగారు’(Raja Vaaru Ranivaru) సినిమాతో హీరోయిన్‌గా ప్రేక్షకులకు పరిచయం అయిన రహస్య గోరఖ్(Rahasya Gorak) మనందరికీ సుపరిచితమే. తన మొదటి చిత్రంతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ చిన్నది. అలాగే తన అందం, అభినయంతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. ఇక ఈ మూవీలో హీరోగా నటించిన కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram)తో ప్రేమలో పడి దాదాపు ఐదేళ్లు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి గత ఏడాది పెళ్లి కూడా చేసుకున్నారు. అంతేకాదండోయ్ రీసెంట్‌గా హనుమాన్ జయంతి నాడు ఈ ముద్దుగుమ్మ ఓ బాబుకు కూడా జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కిరణ్ అబ్బవరం తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరికీ తెలిసింది.
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఈ అమ్మడు. ఈ క్రమంలో తన ఇన్‌స్టాలో ఓ క్రేజీ ఫొటో షేర్ చేస్తూ మరింత ఆకట్టుకుంది. అందులో కిరణ్ అబ్బవరం ఒక హ్యాండ్ పైకి అని ఆడియన్స్‌కు హాయ్ చెప్తున్న పిక్‌ను పైన.. అచ్చుగుద్దినట్లు తన కొడుకు కూడా ఫాదర్‌లాగా చేతిని పైకి అన్న ఫొటోను కింద సెట్ చేసి.. ‘ఈ ఉదయం అతను నన్ను ఇలా ఆశ్చర్యపరిచాడు’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. జూనియర్ కిరణ్ అబ్బవరం అని, తండ్రికి తగ్గ తనయుడు అని, సేమ్ టు సేమ్ డ్యాడిని దించేశాడుగా అని నెటిజన్లు, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఆ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.






