- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగాస్టార్ చిరంజీవికి లక్కీ చార్మ్‌గా మారిన హీరోయిన్.. ఆమె ఉన్న సినిమాలు బ్లాక్ బస్టర్సే
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తాజాగా ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Varaprasad Garu) మూవీతో మన ముందుకు వచ్చి మంచి హిట్ కొట్టాడు.

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తాజాగా ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Varaprasad Garu) మూవీతో మన ముందుకు వచ్చి మంచి హిట్ కొట్టాడు. అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ నయనతార(Nayanatara)తో పాటు క్యాథరిన్(Catherine) కూడా యాక్ట్ చేసింది. ఇక వెంకటేష్(Venkatesh) కామియో రోల్ చేసిన ఈ మూవీ ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. అదేమిటంటే.. క్యాథరిన్ ట్రెసా చిరంజీవికి లక్కీ చార్మ్‌గా నిలుస్తోంది.
అప్పట్లో చిరు నటించిన వాల్తేరు వీరయ్యలో కూడా ఈ ముద్దుగుమ్మ నటించడం వల్ల ఆ సినిమా మంచి హిట్ సాధించగా.. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ మూవీలో కూడా ఈ చిన్నది ఉన్నది . అందువల్ల ఈ సినిమా కూడా హిట్ అయిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అందుకే మెగాస్టార్‌కు లక్కీ హీరోయిన్ అంటే క్యాథరిన్ అనే పేరు ప్రజెంట్ బాగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






