- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘క్యాట్’లో సీనియర్ ఐపీఎస్ సునీల్‌కుమార్‌కు చుక్కెదురు.. సస్పెన్షన్‌లోనే పదవీ విరమణ!
‘క్యాట్’లో సీనియర్ ఐపీఎస్ అధికారి పి.వి.సునీల్‌కుమార్‌కు చుక్కెదురైంది. తనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్) మంగళవారం కొట్టివేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ‘క్యాట్’లో సీనియర్ ఐపీఎస్ అధికారి పి.వి.సునీల్‌కుమార్‌కు చుక్కెదురైంది. తనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్) మంగళవారం కొట్టివేసింది. సునీల్ కుమార్ అభ్యర్థనను తోసిపుచ్చిన క్యాట్.. ఆయన సస్పెన్షన్‌ను సమర్థించింది. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సునీల్ కుమార్ సస్పెన్షన్‌లో ఉన్నారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఇవాళ ఉదయం విచారణలో అతని వాదనలు విని సస్పెన్షన్ రద్దు చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ రోజు పని వేళలు ముగిసిన తర్వాత ఆయన పదవీ విరమణను రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్‌లోనే నోటిఫై చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ సీఐడీ చీఫ్‌గా ఉన్న సమయంలో అప్పటి ఎంపీ రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై ప్రస్తుత ప్రభుత్వం సునీల్‌కుమార్‌పై కేసు నమోదు చేసింది. అలాగే ఫైర్ డీజీగా ఉన్నప్పుడు నిధుల దుర్వినియోగం, అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం వంటి కారణాలతో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.
నా భర్త రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపండి!
సునీల్ కుమార్‌కు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ (పదవీ విరమణ ప్రయోజనాలు) ఆపేయాలని ఆయన భార్య అరుణ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. భర్తపై తాను 2017లో గృహహింస, వరకట్న వేధింపుల కేసు నమోదు చేశానని, ఇప్పుడు ఆయనకు బెనిఫిట్స్ ఇస్తే తన జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందని ఆమె ప్రభుత్వానికి సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ పరిణామాల మధ్య ప్రభుత్వం సోమవారం ఆయన పదవీ విరమణకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. అయితే, ఆయనపై ఉన్న కేసుల విచారణల తుది తీర్పు, కేంద్ర మార్గదర్శకాలకు లోబడే రిటైర్మెంట్ ప్రయోజనాలు ఉంటాయని సీఎస్ స్పష్టం చేశారు. కాగా, సునీల్ కుమార్‌తో పాటు మరో సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ కూడా మంగళవారం పదవీ విరమణ కానున్నారు.






