అస్సలు వేచి ఉండలేనంటూ అతనితో ఉన్న ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్స్

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ హీరో నారా రోహిత్(Nara Rohith) ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘సుందరకాండ’(Sundarakanda).

అస్సలు వేచి ఉండలేనంటూ అతనితో ఉన్న ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో నారా రోహిత్(Nara Rohith) ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘సుందరకాండ’(Sundarakanda). నిమ్మల పూడి వెంకటేష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో శ్రీదేవి విజయ్ కుమార్, వ్రితి వాఘావి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే సందీప్ పిక్చర్స్ ప్రాలెస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, సత్య, అజయ్, అభినవ్, వీ టీవీ గణేష్, సునైనా, రఘు బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 27న థియేటర్లలో రాబోతున్నట్లు తాజాగా మూవీ టీమ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో నారా రోహిత్‌కు కాబోయే భార్య సిరి లెల్ల(Siri Lella) తన ఇన్‌స్టా(Instagram)లో ఓ క్రేజీ పోస్ట్ షేర్ చేసింది. అందులో నారా రోహిత్‌తో దిగిన కొన్ని క్యూట్ పిక్స్‌ను షేర్ చేస్తూ.. ‘హమ్మయ్య, ఫైనల్లీ సుందరకాండ మూవీ ఆగస్టు 27న థియేటర్లలో రాబోతుంది.. అస్సలు వేచి ఉండలేను’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతోఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా సిరి-రోహిత్ ‘ప్రతినిధి-2’(Prathinidhi-2)లో జంటగా నటించి ఆ మూవీ టైంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి ఇప్పుడు ఎంజేగ్‌మెంట్ కూడా చేసుకున్నారు. త్వరలో మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నాారు.

Next Story