రంజాన్ ముబారక్ అంటూ ఫొటోస్ షేర్ చేసిన హీరోయిన్.. పోస్ట్ వైరల్

by Gugulothu.Kavitha |

నటి హీనాఖాన్(Heena Khan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై హీరోయిన్‌గా తన నటనతో మంచి ఫేమ్ తెచ్చుకుంది.

రంజాన్ ముబారక్ అంటూ ఫొటోస్ షేర్ చేసిన హీరోయిన్.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: నటి హీనాఖాన్(Heena Khan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై హీరోయిన్‌గా తన నటనతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో వెండితెరపై ఆఫర్లు వచ్చాయి. అక్కడ కూడా తన యాక్టింగ్‌తో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. అయితే రీసెంట్‌గా బ్రెస్ట్ క్యాన్సర్(Brest Cancer) బారిన పడింది. ఆ విషయాన్ని స్వయంగా ఈ భామ సోషల్ మీడియాలో షేర్ చేయగా అందరికీ తెలిసింది. దీంతో ఆమె ఆ మహమ్మారి నుంచి తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

అలాగే ఈ బ్యూటీ నిత్యం తన కీమోథెరపీ చికిత్స బాధల ఫొటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తూ అభిమానలకు తన పెయిన్ తెలియజేస్తుంది. అయితే ఆత్మవిశ్వాసంతో క్యాన్సర్ బారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అయితే ముస్లింత పవిత్ర నెల అయిన రంజాన్ నిన్నటి నుంచి స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే ఒక్కపొద్దు ఉండటం ఆనవాయితి. చిన్నా, పెద్దా, ముసలి, ముతక అని తేడా లేకుండా అందరూ ఉంటారు. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

తాజాగా హీనాఖాన్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో ముస్లిం పద్ధతిలో రెడీ అయి.. ఖర్జూర పండ్లు, నమాజ్ చేస్తున్న ఫొటోలు, ఫ్లవర్ ఫొటోస్,తన మదర్‌తో ఉన్న ఫొటోలు షేర్ చేసి రంజాన్ ముబారక్(Ramadan Mubarak) అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఆ అల్లా మీకు మంచి చేయాలని కోరుకుంటున్నామని కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ బ్యూటీ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.

Next Story