అతనితో దిగిన క్యూట్ ఫొటో షేర్ చేసిన హీరోయిన్.. నేను నిన్ను లవ్ చేస్తున్నానంటూ పోస్ట్

by I. Sairam |

యంగ్ హీరోయిన్ రాఖి ఖన్నా గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

అతనితో దిగిన క్యూట్ ఫొటో షేర్ చేసిన హీరోయిన్.. నేను నిన్ను లవ్ చేస్తున్నానంటూ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరోయిన్ రాఖి ఖన్నా గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన ఫస్ట్ సినిమాతోనే మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో పాటు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ సరసన తెలుసు కదా మూవీలో యాక్ట్ చేస్తుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ చిన్నదాని పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

తాజాగా రాశి ఖన్నా తన ఇన్‌స్టాలో తన బ్రదర్‌తో దిగిన క్యూట్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘పెయింట్‌బాల్ యుద్ధాల నుండి మ్యాగీ చర్చల వరకు, మీసాలకు సరిపోయే పర్వత ఈతల వరకు - మీరు ఎల్లప్పుడూ నా అంగరక్షకుడు, ప్రయాణ స్నేహితుడు మరియు జీవితాంతం తోడు ఉండే నీడ. నన్ను ఎలా బాధపెట్టాలో అండ్ అదే టైంలో నన్ను ఎలా రక్షించాలో తెలిసిన వ్యక్తికి రాఖీ శుభాకాంక్షలు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అనే క్యాప్షన్ జోడిస్తూ రాఖీ శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story