- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విడాకుల రూమర్స్ పై స్పందించిన అలనాటి హీరోయిన్.. ఆగడాలు ఆగట్లేదంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అలనాటి హీరోయిన్ సంగీత(Sangeetha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: అలనాటి హీరోయిన్ సంగీత(Sangeetha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే కన్నడ, తమిళ భాషల్లో కూడా నటించి అలరించింది. ప్రజెంట్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameshwaran) హీరోయిన్‌గా నటిస్తున్న ‘పరదా’(Parada) మూవీలో కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక ఈ భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే సింగర్ క్రిష్(Krish)ను ఈ చిన్నది ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక ఈ జంటకు ఓ పాప కూడా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా సంగీత- క్రిష్ విడాకులు తీసుకోబోతున్నారని కొన్ని పుకార్లు నెట్టింట షికార్లు చేస్తున్నాయి.
ఈ రూమర్స్‌కి కారణం సంగీత తన ఇన్‌స్టా ఖాతాలో పేరు మార్చడం. గతంలో ఇన్‌స్టాలో సంగీత క్రిష్ అని ఉండేది. కానీ ఇప్పుడు సంగీత యాక్టర్‌గా బయో మారింది. దీంతో వీరి మధ్య నిజంగానే మనస్పర్థలు వచ్చాయంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా విడాకుల వార్తలపై నటి సంగీత స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ‘విడాకులు తీసుకుంటున్నామంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు.
అవి పూర్తిగా అవాస్తవం. నేను స్టార్టింగ్ నుంచి నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో నా పేరును సంగీత యాక్టర్ గానే ఉంచుకున్నాను. వాస్తవానికి ఇది ఇప్పటికీ అలాగే ఉంది. మా ఆయనతో కలిసి సంతోషంగా ఉంటున్నా. ఈ రూమర్లపై స్పందించాల్సిన అవసరం లేదు కానీ.. మీ ఆగడాలు మాత్రం ఆగడం లేదు అందుకే రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.






