బ్లూ కలర్ లంగా వోణీలో మెరిసిపోతున్న ‘గోదారి గట్టుపైన’ హీరోయిన్

by Pulgam srinivas |

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న నీది ప్రదీప్ తాజా ఫోటోలు.

బ్లూ కలర్ లంగా వోణీలో మెరిసిపోతున్న ‘గోదారి గట్టుపైన’ హీరోయిన్
X

దిశ, వెబ్ డెస్క్: సుమంత్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘గోదారి గట్టుపైన’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ నీది ప్రదీప్. ప్రస్తుతం ఈ నటి పేరు తెలుగు సినీ పరిశ్రమలో మారుమోగుతోంది.



ఈ సినిమాలో ఆమె నటనతో పాటు అందచందాలు కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకోవడంతో రాబోయే రోజుల్లో ఈ బ్యూటీకి తెలుగు సినీ పరిశ్రమలో మరిన్ని మంచి అవకాశాలు దక్కే ఛాన్సెస్ ఉన్నాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు.




ఈ బ్యూటీ సినిమాల విషయాన్ని కాసేపు పక్కన పెడితే నీది ప్రదీప్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.




తాజాగా నీది తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో ఆమె బ్లూ కలర్ డ్రెస్‌పై గోల్డ్ కలర్ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న లంగా వోణీ ధరించి ఆకట్టుకుంది.




ఇక నడుముకు వడ్డానం, మెడలో భారీ నెక్లెస్, చెవులకు పెద్ద ఇయర్‌రింగ్స్ ధరించి ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోయింది. అలాగే డ్రెస్‌కు సరిపోయే గాజులు, నుదుటిపై చిన్న బొట్టు పెట్టుకొని క్లాస్ అండ్ డీసెంట్ స్టైల్‌లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.




ప్రస్తుతం ఈ ఫోటోలలో నీది ప్రదీప్ ఎంతో అందంగా కనిపిస్తుండటంతో అవి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story