వాలు కళ్లతో వయ్యారంగా చూస్తూ గత్తర లేపుతున్న హీరోయిన్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే

by I. Sairam |   (  Updated:2025-05-03 03:01:20  IST  )

‘లవ్‌టూడే’(Love Today) సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన యంగ్ బ్యూటీ ఇవానా(Ivana) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

వాలు కళ్లతో వయ్యారంగా చూస్తూ గత్తర లేపుతున్న హీరోయిన్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: ‘లవ్‌టూడే’(Love Today) సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన యంగ్ బ్యూటీ ఇవానా(Ivana) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో డబ్ అయి మంచి విజయాన్ని సాధించింది. ముఖ్యంగా హీరోయిన్‌ ఇవానా నటన అందరిని ఆకట్టుకుంది. దీంతో ఈ భామకు తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

ఇందులో భాగంగా యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటిస్తున్న ‘సింగిల్’(Single) మూవీలో నటించే చాన్స్ కొట్టేసింది. ఇక ఈ చిత్రంలో కేతిక శర్మ(Kethika Sharma) కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే దీన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ పై విద్యా కొప్పినీడి(Vidya Koppineedi), భాను ప్రతాప్(Bhanu Pratap), రియాజ్ చౌదరి(Riyaz Choudhary) నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ మే 9న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో లైట్ బ్లూ కలర్ డ్రెస్‌లో పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని, చేతులకు గాజులు వేసుకుని, ముఖానికి బొట్టు కూడా పెట్టుకుంది. అలాగే వాలు కళ్లతో వయ్యారంగా చూస్తూ ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఉఫ్.. ఇంత అందాన్ని తట్టుకోవడం కష్టమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story