- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్..
బాలీవుడ్ హీరోయిన్ సోనాలి సైగల్(Sonnalli Seygall) ‘ప్యార్ కా పంచనామా’ (Pyaar ka Panchanama) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ సోనాలి సైగల్(Sonnalli Seygall) ‘ప్యార్ కా పంచనామా’ (Pyaar ka Panchanama) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హైజాక్, వెడ్డింగ్ పులావ్, ప్యార్ కా పంచనామా-2 వంటి చిత్రాల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే అశేష్ సజ్నాని పెళ్లి చేసుకుంది. అయితే వీరిద్దరు 16 ఆగస్టు 2024లో తమ తల్లిదండ్రులము కాబోతున్నట్లు సోషల్ మీడియా(Social Media) ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా బీరు బాటిళ్లు పట్టుకునే చేతిలో పాల సీసాలు పట్టుకొని సమయం ఆసన్నమైందని క్యాప్షన్ జత చేశారు.
అంతేకాకుండా బేబీ బంప్(Baby bump)తో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా, సోనాలి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అశేష్ సజ్నాని(Ashesh L Sajnani), సోనాలి జంటకు కూతురు పుట్టింది. ఇందుకు సంబంధించిన పొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.






