- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎట్టకేలకు ప్రియుడితో పెళ్లి పీటలెక్కిన హీరోయిన్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అభినయ(abhinaya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అభినయ(abhinaya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుట్టినప్పటి నుంచి మాట వినికిడి శక్తి లేకపోయినప్పటికీ నటనపై ఇంట్రెస్ట్‌తో ఇండస్ట్రీకి పరిచయం అయింది. అలా తెలుగులో ‘నేనింతే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత కింగ్(King), శంభో శివ శంభో(Shambho Shiva Shambho), ఢమరుకం(Damarukam), దమ్ము (dammu), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(Seethamma Vakitlo Sirimalle Chettu), ది ఫ్యామిలీ స్టార్ (The Family Star)వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
అలాగే తన అందంతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. అంతేకాకుండా తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించడంతో పాటు అవార్డులు కూడా తీసుకుంది. ఇదిలా ఉంటే.. అభినయ రీసెంట్‌గా తన ప్రియుడైన వీ కార్తీక్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన విషయం విదితమే. కానీ పెళ్లి డేట్‌ను మాత్రం వెల్లడించలేదు. తాజాగా, అభినయ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఏకంగా మెహందీ ఫొటోలు షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇందులో తన కాబోయే భర్త, ఫ్రెండ్స్‌తో కలిసి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసింది. అయితే తాజాగా అభినయ వివాహ బంధం లోకి అడుగుపెట్టింది. బుధవారం హైదరాబాద్, జూబ్లీ హిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి మ్యారేజ్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఈ కపుల్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు.
Read More..






