- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Thaman: తమన్ కొట్టే కొట్టుడికి పడిపోయిన సౌండ్ బాక్సులు.. వెంటనే అలాంటి పని చేసిన హీరోయిన్ ( Video )

దిశ, వెబ్ డెస్క్ : బాలయ్య మూవీ అంటే తమన్‌కు ( Thaman ) పూనకాలు వస్తాయన్న విషయం మనకీ తెలిసిందే. అఖండ మూవీ రిలీజ్ అయినప్పుడు చాలా థియేటర్లలో సౌండ్ బాక్సులు బద్దలయ్యాయి. ఇక, ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయ్యే సమయంలో " డాకు మహారాజ్ "లో అదే రిపీట్ అవుతుందని తమన్ చెప్పకనే చెప్పేశాడు. బాలయ్య, తమన్ కలిసి వస్తున్నారంటే బాక్సులు బ్రేక్ అవ్వడం పక్కా .. మీరు ప్రిపేర్ అయిపోండంటూ తమన్ ఫ్యాన్స్ కు ముందే చెప్పేస్తున్నాడు.
అయితే, శుక్రవారం హైద్రాబాద్ లో " డాకు మహారాజ్ " ( Daaku Maharaaj ) ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ ఓ పాటను ప్లే చేసే సమయంలో స్టేజ్ కింద ఉన్న స్పీకర్ కింద పడిపోయింది. దీంతో ఈవెంట్లో ఉన్నవారు పక్కున నవ్వేశారు. సినిమాలో నటించిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ వీడియో తీస్తూ బాగా ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. వామ్మో , ఏంటి తమన్ ఈ కొట్టుడు ఏందీ సామీ.. ఈవెంట్‌లోని బాక్సులే ఇలా గల్లంతు అవుతున్నాయి.. రేపొద్దున థియేటర్లో డాకు దెబ్బకు సౌండ్ బాక్సులు కనిపించకుండా పోతాయేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.






