- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ ప్రీమియర్లకు అద్భుతమైన స్పందన
హీరో తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ ఈ సినిమాకు

దిశ, వెబ్ డెస్క్: హీరో తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ ( The Great Pre Wedding Show). ఈ సినిమాకు సందీప్ అగరం, అస్మిత రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రేపు రిలీజ్ కానుండగా.. ఇవాళ ప్రీమియర్స్ పడిపోయాయి. సినిమా కథ అద్భుతంగా ఉందని.. ప్రీమియర్ షోలు చూసిన వాళ్ళు చెబుతున్నారు. పాజిటివ్ టాక్ బయటకు రావడంతో చిత్ర బృందం సంబరపడిపోతుంది. ఈ సందర్భంగా హీరో తిరువీర్ మాట్లాడుతూ.. ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ కు సపోర్ట్ చేసిన సినిమా ఇండస్ట్రీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సినిమా 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుందని ఈ సందర్భంగా తెలిపారు. మసుదా, జార్జ్ రెడ్డి కూడా ఇదే నెలలో గతంలో రిలీజ్ అయినట్లు గుర్తు చేశారు. విలన్ స్థాయి నుంచి ఈ కో-ప్రొడ్యూస్ చేసే స్థాయికి ఎదిగానని.. దీనంతటికీ ప్రేక్షకులే కారణమని స్పష్టం చేశారు. కథ మీద నమ్మకంతోనే ముందే ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ సినిమా ప్రీమియర్లు వేసామని తెలిపారు. జనాల్లోకి సినిమా వెళ్లేలా ప్రమోషన్స్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత సందీప్ అగరం మాట్లాడారు. దర్శకుడు రాహుల్ తనను నిర్మాతగా మార్చినట్లు తెలిపారు. ఈ కథ అందరినీ ఆకట్టుకుందనే నమ్మకం ఉందన్నారు. నేను చేసే ప్రతీ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బలిని తీసుకుంటానని ప్రకటించారు.






