వైభవంగా ‘కామాఖ్య’ సినిమా షురూ.. ఆకట్టుకుంటున్న ఫొటోలు

by Gugulothu.Kavitha |

సమైరా(Samaira), సముద్రఖని(Samudra Khani), అభిరామి(Abhirami) ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘కామాఖ్య’(Kamakhya).

వైభవంగా ‘కామాఖ్య’ సినిమా షురూ.. ఆకట్టుకుంటున్న ఫొటోలు
X

దిశ, వెబ్‌డెస్క్: సమైరా(Samaira), సముద్రఖని(Samudra Khani), అభిరామి(Abhirami) ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘కామాఖ్య’(Kamakhya). దీనికి అభినయ కృష్ణ(Abhinaya Krishna) దర్శకత్వం వహిస్తుండగా.. మై ఫిల్మ్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లిమిటెడ్‌ బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీవాణీనాథ్‌, యశ్వంత్‌రాజ్‌ నిర్మిస్తున్నారు. ఇక ఆనంద్‌, శరణ్య ప్రదీప్‌, వైష్ణవ్‌, ధనరాజ్‌, రాఘవ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి గ్యాని(Gnani) సంగీతం అందిస్తున్నారు. అయితే ఆదివారం ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది.

ముహూర్తపు సన్నివేశానికి మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ క్లాప్‌ ఇచ్చి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. మిస్టీరియస్‌ థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌తో కూడిన ఓ యూనిక్‌ సబ్జెక్ట్‌ని డైరెక్టర్‌ అభినయకృష్ణ సిద్ధం చేశారని, అన్ని వర్గాలకూ నచ్చే థ్రిల్లర్‌ అవుతుందని, ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. ప్రస్తుతం పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Link

Next Story