ది గర్ల్ ఫ్రెండ్ హిట్.. 'రాహుల్ రవీంద్రన్'కి రెండు అవకాశాలు

by Pulgam srinivas |

రాహుల్ రవీంద్రన్.. అడవి శేష్, దీక్షిత్ ఇద్దరికీ కథలను చెప్పి ఒప్పించినట్లు తెలుస్తోంది. అందులో దీక్షిత్ సినిమా ఫస్ట్ స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం.

ది గర్ల్ ఫ్రెండ్ హిట్.. రాహుల్ రవీంద్రన్కి రెండు అవకాశాలు
X

దిశ, వెబ్ డెస్క్: నటుడు మరియు దర్శకుడు అయిన రాహుల్ రవీంద్రన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన అందాల రాక్షసి అనే చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందడంతో ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించిన ఈయనకు హీరోగా భారీ స్థాయి విజయాలు దక్కలేదు. దానితో ఈయన అనేక సినిమాల్లో కీలక, ముఖ్య పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడు.

కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు. ఈయన సుశాంత్ హీరోగా రూపొందిన 'చి ల సౌ' అనే చిత్రంతో దర్శకుడిగా కెరీర్ను ప్రారంభించాడు. ఈ సినిమా తర్వాత రష్మిక మందన ప్రధాన పాత్రలో రూపొందిన ది గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ రెండు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం ఈ దర్శకుడు రెండు కథలపై పనిచేస్తున్నట్లు, అందులో అడవి శేష్ కి ఒక కథను కూడా వినిపించినట్లు, ఆయనకు ఆ స్టోరీ బాగా నచ్చి నటించడానికి ఆసక్తిని కూడా చూపినట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ కథతో పాటు మరో కథపై కూడా రాహుల్ ఆసక్తి చూపుతున్నట్లు, అందులో ది గర్ల్ ఫ్రెండ్ ఫేమ్ దీక్షిత్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీక్షిత్ హీరోగా చేసే సినిమానే మొదట పట్టాలెక్కబోయే ఛాన్స్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని నిర్మించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత అడవి శేష్ తో ఈ దర్శకుడు సినిమా చేస్తాడేమో చూడాలి.

Next Story