ప్రేమించిన అమ్మాయికి వేరే వాడితో పెళ్లి.. గుండె పగిలేలా ఏడ్చి ప్రాణాలు కోల్పోయిన జబర్దస్త్ కమెడియన్(వీడియో)

by I. Sairam |   (  Updated:2025-07-26 02:44:50  IST  )

ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్(Jabardasth) వల్ల చాలా మంది పాపులారిటీ సంపాదించుకున్నారు.

ప్రేమించిన అమ్మాయికి వేరే వాడితో పెళ్లి.. గుండె పగిలేలా ఏడ్చి ప్రాణాలు కోల్పోయిన జబర్దస్త్ కమెడియన్(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్(Jabardasth) వల్ల చాలా మంది పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా ఫేమస్ అయిన వారిలో నూకరాజు(Nukaraju), ఆసియా(Asia) జంట ఒకటి. ఆన్ స్క్రీన్ లో ఎక్కువగా ప్రేమికులుగా కనిపించే ఈ జంట నిజ జీవితంలోనూ మంచి స్నేహితులు. ప్రస్తుతం వీరు తమ ప్రొఫెషనల్ లైఫ్‌తో బిజీ బిజీగా ఉన్నారు. వీరిద్దరు కలిసి ప్రజెంట్ ప్రైవేట్ ఆల్బమ్స్, మ్యూజిక్ వీడియోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా తాటి బెల్లం సాంగ్‌తో వచ్చిన ఈ జంట తాజాగా మరో అందమైన ఫోక్ సాంగ్‌తో మన ముందుకు వచ్చారు. అయితే జబర్దస్త్ ఫేమ్ బాబు డైరెక్షన్లో తెరకెక్కిన సల్లగుండ రాదే సాంగ్ ప్రోమో శుక్రవారం (జులై 04) విడుదలైంది.

ఈ పాటలో ఆసియా వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో నూకరాజు తల్లడిల్లిపోతాడు. ఆసియాతో గడిపిన స్వీట్ మొమోరీస్‌ను గుర్తు చేసుకుని తనలో తాను కుమిలిపోతాడు. ఇక చివరికి ప్రాణాలనే కోల్పోతాడు. అది చూసిన ఆసియా అతని శవంపై పడి బోరున ఏడుస్తుంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఇక దీనిని చూసిన వారందరూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రీల్ లైఫ్‌లో ఒకే బట్ రియల్ లైఫ్‌లో ఇలా జరగకూడదు.. మేం తట్టుకోలేం, ఆసియా నువ్వు ఎప్పుడూ నూకరాజుతోనే ఉండాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. అదే సమయంలో ఈ పాట సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ విషెస్ చెబుతున్నారు. కాగా త్వరలోనే ఈ సాంగ్ ఫుల్ వెర్షన్ రిలీజ్ కానుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పాట ప్రోమోను చూసేయండి.

Link

Next Story