- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"ది గర్ల్ ఫ్రెండ్" నాకెంతో సంతృప్తినిచ్చింది.. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు : ప్రొడ్యూసర్ అల్లు అరవింద్
నేషనల్ బ్యూటీ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో.. దీక్షిత్ శెట్టి హీరోగా గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన సినిమా "ది గర్ల్ ఫ్రెండ్".

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ బ్యూటీ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో.. దీక్షిత్ శెట్టి హీరోగా గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 14వ తేదీన తెలుగు సహా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. బుధవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించగా.. అల్లు అరవింద్ రష్మిక, విజయ్ ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేయడంపై స్పందించిన ఆయన.. తాను నటించిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రష్మికే రానప్పుడు విజయ్ ఏం వస్తాడు? అని అన్నారు. అందుకే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇక సినిమాలను నిర్మించడం ద్వారా తాను కోట్లాది రూపాయలు సంపాదించాననడంలో ఎలాంటి దాపరికం లేదన్న అల్లు అరవింద్.. "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా ద్వారా మాత్రం తాను సంపాదించాలనుకున్నది సంతృప్తి మాత్రమేనన్నారు. రాహుల్ తనకు ఈ కథను ఎంత ఉద్వేగంతో చెప్పాడో.. అంతే ఉద్వేగంతో తెరకెక్కించాడని తెలిపారు. సినిమాలో పాటలెన్ని?, జోక్స్ ఎన్ని?, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంది? అని చూసే సినిమా కాదన్నారు. మన అక్క, చెల్లి, పిన్ని మనసుల్లో ఏముంటుంది? ఎలాంటి కోరికలుంటాయి? అన్న ఉద్దేశంతో "ది గర్ల్ ఫ్రెండ్" మూవీని చూడాలన్నారు. ఇక ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందించగా, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ చేశారు.






