- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ నుంచి ఆ ఫుల్ సాంగ్ రిలీజ్.. పోస్ట్ వైరల్
యాంకర్ ప్రదీప్(Pradeep Machiraju) హీరోగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’(30 Rojullo Preminchadam Ela) అనే సినిమాతో సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: యాంకర్ ప్రదీప్(Pradeep Machiraju) హీరోగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’(30 Rojullo Preminchadam Ela) అనే సినిమాతో సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammai Ikkada Abbai). ఈ చిత్రంలో ప్రదీప్ సరసన యాంకర్ దీపికా పిల్లి(Deepika {illi) కథానాయికగా నటించి.. హీరోయిన్గా వెండితెరకు పరిచయం అయింది.
ఇక ఈ చిత్రాన్ని నితిన్(Nithin), భరత్(Bharath)లు తెరకెక్కించారు. ఇక ఇందులో సత్య(Sathya), గెటప్ శ్రీను(Getup Srinu), వెన్నెల కిశోర్(Vennela Kishore), మురళీధర్ గౌడ్(Muralidhar Goud), సుందర్(Sundar), రోహిణి(Rohini), ఝాన్సీ(Jhansi) వంటి వారు కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా ఏప్రిల్ 11న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి థీమ్ సాంగ్ అయినటువంటి ఓడియమ్మ బడవా(Odiyamma Badava) ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. ఈ విషయాన్ని యంగ్ హీరో ప్రదీప్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. అందులో ‘ఓడియమ్మ బడవా ఫుల్ సాంగ్ రిలీజ్ అయింది. ఇంకా థియేటర్లలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.. మీరు కూడా టికెట్స్ బుక్ చేసుకుని సినిమా చూసేయండి’ అని రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.






