- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Actress Ananya Nagalla : ఉగ్రదాడిపై స్పందించిన తొలి తెలుగు నటి
జమ్మూకాశ్మీర్లోని పహల్గంలో మంగళవారం ఉగ్రవాదులు దాడి(Pahalagam Terror Attack) చేసి 26 మంది అమాయకులను బలి తీసుకున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : జమ్మూకాశ్మీర్లోని పహల్గంలో మంగళవారం ఉగ్రవాదులు దాడి(Pahalagam Terror Attack) చేసి 26 మంది అమాయకులను బలి తీసుకున్న విషయం తెలిసిందే. భారత్ తో పాటు ప్రపంచాన్ని కుదుపు కుదిపేసిన ఈ ఘటనను ప్రతీ ఒక్కరూ తీవ్రంగా ఖండించారు. అయితే ఈ ఘటనపై స్పందించేందుకు సెలెబ్రెటీలు ఆలోచిస్తూ ఉంటే.. ఓ తెలుగు నటి మాత్రం ముందుకు వచ్చి ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. ఆమె ఎవరో కాదు నటి అనన్య నాగళ్ళ(Actress Ananya Nagalla). ఉగ్రదాడిలో మరణించిన ఏపీలోని నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధు సూదన్ రావు(Madhu Sudan Rao) మృతదేహానికి నేడు నివాళులు(Tributes) అర్పించింది. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చిన అనన్య.. ఈ ఘటన తనను ఎంతో బాధించిందని తెలిపింది.
ఇది మనవత్వానికే మచ్చ తెచ్చే ఘటన అని, అమాయకులను పొట్టన బెట్టుకున్న ముష్కరులను వదలొద్దని, ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని కేంద్రాన్ని కోరింది. అనన్య చూపిన ఈ తెగువకు నెట్టింట్లో ప్రశంసలు కురుస్తున్నాయి. ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అని టాలీవుడ్ సెలెబ్రెటీస్ తపటాయిస్తుంటే అనన్య మాత్రం ఇలా ధైర్యంగా దాడి గురించి మాట్లాడి, శభాష్ అనిపించుకుంది. ఇక గతంలో కూడా ఖమ్మం, విజయవాడలో వరదలు సంభవించినప్పుడు తనవంతు సహాయంగా రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించి గొప్ప మనసు చాటుకుంది ఈ అమ్మడు.






