‘కిష్కిందపురి’ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో అవుట్.. రొమాన్స్‌తో రెచ్చిపోయిన హీరో, హీరోయిన్

by Gugulothu.Kavitha |

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) రీసెంట్‌గా ‘భైరవం’(Bhairavam) మూవీతో మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

‘కిష్కిందపురి’ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో అవుట్.. రొమాన్స్‌తో రెచ్చిపోయిన హీరో, హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) రీసెంట్‌గా ‘భైరవం’(Bhairavam) మూవీతో మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ప్రజెంట్ నటిస్తున్న తాజా సినిమా ‘కిష్కింధ పురి’(Kiskindhapuri). ఇక హారర్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి ‘చావు కబురు చల్లగా’ డైరెక్టర్ కౌషిక్ పెగళ్లపాటి(Koushik Pegallapathi) దర్శకత్వం వహిస్తున్నాడు. యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్, అర్చన ప్రెజెంట్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి మూవీ మేకర్స్ వరుస అప్‌డేట్స్ విడుదల చేస్తూ అంచనాలను పెంచుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఉండిపోవే నాతోనే’(Undipove Nathone) అనే సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇక వీడియోలో అనుపమ, బెల్లంకొండ శ్రీనివాస్‌లు రొమాన్స్‌తో రెచ్చిపోయారు. ముద్దులు, హగ్గులతో ప్రోమో క్రేజీగా అనిపించింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ప్రోమోనే ఇలా ఉంటే ఇంకా ఫుల్ సాంగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఫుల్ లిరికల్ సాంగ్ ఈరోజు సాయంత్రం 4గంటల 5నిమిషాలకు విడుదల కానుంది. Link

Next Story