‘రెట్రో’ నుంచి ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్.. హైప్ పెంచుతున్న ట్వీట్ వైరల్

by Kavitha |   ( Updated:2025-02-12 05:56:24.0  )
‘రెట్రో’ నుంచి ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్.. హైప్ పెంచుతున్న ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో సూర్య(Surya) భాషతో సంబంధం లేకుండా ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. అలాగే కేవలం డబ్బింగ్ చిత్రాలతోనే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే రీసెంట్‌గా ‘కంగువా’(Kanguva) సినిమాతో ఓకే ఓకే అనిపించుకున్న సూర్య.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అందులో ‘రెట్రో’(Retro) ఒకటి. దీనికి ‘జిగ‌ర్తాండ’ ఫేమ్ కార్తిక్ సుబ్బ‌రాజ్ (Karthik Subbaraj) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ఇక భారీ బడ్జేత్‌తో 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే సూర్య సరసన పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సంతోష్ నారాయణ(Santhosh Narayana) సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 1న రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టైటిల్ టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ఆకట్టుకోని సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘కన్నాడి పోవే’ సాంగ్ లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 13న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. సంతోష్ నారాయణన్ అందించిన ఈ పాట హృదయాలను హత్తుకునే విధంగా ఉంటుందట. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story