- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేటి యువతకు కనెక్ట్ అయ్యేలా ‘బంగారు బొమ్మ’ సాంగ్ రిలీజ్
‘గోదారి గట్టుపైన’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘బంగారు బొమ్మ’ రిలీజ్

దిశ, సినిమా: యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ లేటెస్ట్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో నిధి ప్రదీప్ హీరోయిన్‌గా నటించగా.. జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, ఫస్ట్ రెండు సింగిల్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో ఇప్పుడు ఇదే జోష్‌తో మేకర్స్ తాజాగా ఫస్ట్ సింగిల్ ‘బంగారు బొమ్మ’ను రిలీజ్ చేశారు. హీరోయిన్‌ని ప్రేమగా “బంగారు బొమ్మ” అని పిలుస్తూ, ఆమెను చూసినా, ఆమె గురించి ఆలోచించినా తనకు అశాంతి కలుగుతుందని చెప్పడం అలరిస్తోంది. ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన మనసును ఈ పాట అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. పాట మొత్తం సాఫ్ట్, రొమాంటిక్, ఫన్ ఎక్స్ ప్రెషన్‌తో సాగుతుంది. హీరోయిన్ కనిపించే ప్రతి క్షణంలో కలిగే ఎమోషన్స్, గుండెల్లో తేలే భావనలు, మిగిలిపోయే జ్ఞాపకాలు.. అన్ని కలిపి యూత్ లవ్‌ని గుర్తు చేసే డ్రీమీ మూడ్‌ను సృష్టిస్తాయి. మొత్తంగా ఈ పాట నేటి యువతరాన్ని ఆకట్టుకుంటోంది. కాగా.. రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.






