- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Yami Gautam: 40 ఏళ్ల తర్వాత తెరపైకి రియాల్టీ స్టోరీ.. పవర్‌ఫుల్ మహిళా పాత్రలో యామి గౌతమ్

దిశ, సినిమా: కన్నడ నటి యామీ గౌతమ్ (Yami Gautam) ‘నువ్విలా’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అల్లు శిరీష్ (Allu Sirish) సరసన ‘గౌరవం’, తరుణ ‘యుద్ధం’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. దీంతో బాలీవుడ్(Bollywood)పై ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ.. ప్రజెంట్ అక్కడ వరుస చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే గతేడాది ‘ఆర్టికల్ 370’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకుంది. ఆదిత్య సుహాస్ జంభ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో యామీతో పాటు ప్రియమణి, రాజ్ అర్జున్, స్కంద సంజీవ్ ఠాకూర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు ‘షాబానో బేగం’ (Shah Bano Begum) చిత్రంతో బిజీగా ఉంది.
ఇది 1985లో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన అండ్ వివాదాస్పద తీర్పులలో ఒక్కటైన మహమ్మద్ అహ్మద్ ఖాన్ (Mohammed Ahmed Khan) వర్సెస్ షాబానో బేగం (Shah Bano Begum) కేసును ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత తెరపైకి తీసుకొస్తున్నాడు డైరెక్టర్ సుపర్ణ వర్మ (Suparna Verma). ఇందులో ఇమ్రాన్ హష్మి (Emraan Hashmi), యామీ గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. యామీ షాబాలో బేగం పాత్రలో నటిస్తుండగా.. ఆమె మాజీ భర్త మహమ్మద్ ఖాన్ పాత్రలో ఇమ్రాన్ నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ (First schedule) కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది. 40 సంవత్సరాల క్రితం జరిగిన ఓ నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ కథలో యామీ ఓ శక్తివంతమైన మహిళ పాత్రలో నటిస్తుండగా.. ఈ సినిమాపై సినీ ప్రేమికులతో పాటు ఫ్యాన్స్‌లో ఎంతో ఆశక్తి నెలకొంది.
కాగా.. 1978లో, ఐదుగురు పిల్లల తల్లి అయిన 62 ఏళ్ల షా బానోతో తన భర్త మొహమ్మద్ అహ్మద్ ఖాన్ ఏకపక్షంగా ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత భరణం కోరుతూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 125 కింద సుప్రీంకోర్టును ఆశ్రయించిన షాబానో.. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత సుప్రీంకోర్టు 1985లో ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే.. ఈ తీర్పు తర్వాత ముస్లిం వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించింది. దీంతో మైనారిటీ మహిళలకు అనుకూలంగా అనేక సెక్షన్లు తీసుకొచ్చింది గవర్నమెంట్.
https://x.com/sidkannan/status/1914924540976570741