- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Darshan : జైలు నుంచి వచ్చాక తొలి పోస్ట్ చేసిన అగ్రనటుడు
ప్రియురాలి కోసం తన అభిమాని రేణుకాస్వామి హత్య(Renukaswamy Murder Case) చేసిన కన్నడ అగ్రనటుడు దర్శన్(Kannada Actor Darshan).. ఆ కేసులో బెయిల్ మీద విడుదలైన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ప్రియురాలి కోసం తన అభిమాని రేణుకాస్వామి హత్య(Renukaswamy Murder Case) చేసిన కన్నడ అగ్రనటుడు దర్శన్(Kannada Actor Darshan).. ఆ కేసులో బెయిల్ మీద విడుదలైన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత మొదటిసారిగా తన అభిమానులకు ఓ వీడియో సందేశాన్ని పోస్ట్(Video Post) చేశారు. తన జీవితంలో ఎదుర్కొన్న క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగతంగా అందరినీ కలిసి, కృతజ్ఞతలు చెప్పాలని ఉన్నా.. ఆరోగ్యం సహకరించడం లేదన్నారు. తాను పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం లేదని స్పష్టం చేశారు. అభిమానులు, సన్నిహితులు అర్థం చేసుకోవాలని కోరారు. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మీ ముందుకు వచ్చి, అందరినీ కలుస్తాను అని దర్శన్ ఆ వీడియోలో వెల్లడించారు. తన ప్రియురాలు నటి పవిత్రగౌడ(Pavitra Gouda)ను వేధిస్తున్నాడు అనే కారణంతో రేణుకాస్వామి అనే తన అభిమానిని దర్శన్ హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. కాగా ఈ కేసులో దర్శన్, పవిత్రగౌడతో సహ మరో 15 మందిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. జైలులో తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతున్నట్టు, చికిత్స కోసం బెయిల్ మంజూరు చేసుకోగా.. కోర్ట్ మంజూరు చేసింది. జైలు నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి ఎలాంటి వివరాలు దర్శన్ బయట పెట్టలేదు. అభిమానులతో మాట్లాడలేదు. ఫిబ్రవరి 16న దర్శన్ పుట్టినరోజు రానుండగా.. వేడుకలు దూరంగా ఉంటున్నానని, తనని కలవడానికి ఎవరూ రావొద్దని దర్శన్ ఓ వీడియో పోస్ట్ చేశారు.






