Anil Ravipudi: డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘భూతం ప్రేతం’..

by Chukka Sudharani |

రాజేష్ ధృవ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ రాబోతోన్నది.

Anil Ravipudi: డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘భూతం ప్రేతం’..
X

దిశ, సినిమా: రాజేష్ ధృవ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ రాబోతోన్నది. సృజన ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బి. వెంకటేశ్వర రావు నిర్మించిన ఈ చిత్రంలో యాదమ్మ రాజు, గల్లీబాయ్ భాస్కర్, బిగ్ బాస్ ఇమాన్యుయేల్, బల్వీర్ సింగ్, గడ్డం నవీన్, పవన్ శెట్టి, రాజేష్ ధృవ, రాధిక అచ్యుత్ రావు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్, గ్లింప్స్‌ను టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్‌గా రాణిస్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు.

ఈ చిత్రానికి ‘భూతం ప్రేతం’ అనే టైటిల్ ఫిక్స్ చెయ్యాగా.. టైటిల్ రిలీజ్ చేసిన అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘భూతం ప్రేతం’ టైటిల్, ఫస్ట్ లుక్ చాలా బాగుంది. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ఇక ఈ టైటిల్‌ను బట్టి చూస్తే హారర్, కామెడీ అని అర్థం అవుతోంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ విషయానికి వస్తే.. ఓ ఐదుగురు కుర్రాళ్లు.. భూతానికి, ప్రేతానికి చిక్కినట్టుగానే కనిపిస్తోంది. ఆ భూతం నుంచి ఈ కుర్రాళ్లు ఎలా బయటపడ్డారు? అనే కథను నవ్విస్తూ, భయపెట్టేలా మలిచారని అర్థం అవుతోంది. కాగా.. ఈ ఏడాదిలోనే ‘భూతం ప్రేతం’ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Next Story