- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెగా కోడలు ‘సతీ లీలావతి’ నుంచి ఫస్ట్ లుక్ రాబోతుందోచ్.. క్యూరియాసిటీని పెంచుతున్న పోస్టర్
సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘అందాల రాక్షసి’(andala Rakshasi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో ఫుల్ మార్కులే కొట్టేసింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej)తో పీకల్లోతు ప్రేమలో పడ్డది ఈ అమ్మడు. అలా కొన్నాళ్లు సీక్రెట్‌గా లవ్ చేసుకున్న ఈ జంట గతేడాది పెళ్లి కూడా చేసుకున్నారు.
ఇక మ్యారేజ్ తర్వాత భర్తతో వేకెషన్స్‌కి వెళుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అయితే పెళ్లి తర్వాత ఈ బ్యూటీ ‘మిస్ పర్‌ఫెక్ట్’(Miss Perfect) అనే వెబ్ సిరీస్‌లో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రజెంట్ ‘సతీ లీలావతి’(Sathi Leelavathi) అనే మూవీలో నటిస్తోంది. లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం రాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి) ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. కాగా సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్లు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేస్తూ.. ‘ఎక్సైటింగ్ జర్నీ బిగిన్స్ దిస్ వీకెండ్.. ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ జూన్ 21న రాబోతుంది’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.






