Vishal Mada Gaja Raja: ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తుందని.. మూవీ టీమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

తమిళ స్టార్ హీరో విశాల్ (Vishal) నటించిన చిత్రం ‘మద గజ రాజా’ (Mada Gaja Raja).

Vishal Mada Gaja Raja: ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తుందని.. మూవీ టీమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో విశాల్ (Vishal) నటించిన చిత్రం ‘మద గజ రాజా’ (Mada Gaja Raja). 12ఏళ్ల క్రితమే అనౌన్స్ చేసిన ఈ మూవీ లేటెస్ట్‌గా సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 12న రిలీజై సెన్సేషనల్ హిట్‌ (sensational hit)గా నిలిచింది. జెమినీ ఫిలిం సర్క్యూట్ నిర్మాణంలో రూపొందిన ఈ మూవీకి సుందర్.సి దర్శకత్వం వహించాడు. తమిళ్‌లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుని.. 50 కోట్లకు పైగా వసూలు చేసి సంక్రాంతికి రిలీజైన తమిళ (Tamil) సినిమాలన్నిటిలో నంబర్ వన్ (Number one) చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాంకుండా ఇప్పటికీ భారీ వసూళ్లతో విజయవంతంగా దూసుకుపోతున్న క్రమంలోనే తాజాగా సక్సెస్ మీట్ (Success Meet) నిర్వహించారు చిత్ర బృందం.

ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ.. ‘యాక్షన్ కామెడీ జానర్‌లో రూపొందిన ‘మద గజ రాజా’ ఆడియన్స్‌కి మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్‌ (memorable experience)ని అందించే ఎంటర్ ట్రైనర్. హీరో విశాల్ తన పవర్ ప్యాక్డ్ యాక్షన్‌తో అదరగొట్టారు. సంతానం కామెడీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. డైరెక్టర్ సుందర్.సి (Sundar.C) అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో హోల్సమ్ ఎంటర్‌టైన్మెంట్ అందించారు. విజయ్ ఆంటోని పాటలన్నీ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. తమిళ్‌లో ఘన విజయం సాధించి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులని కూడా అద్భుతంగా అలరిస్తుందని నమ్ముతున్నాము’ అంటూ చెప్పుకొచ్చారు మేకర్స్. కాగా.. ఈ చిత్రంలో సంతానం, వరలక్ష్మి, అంజలి, శరత్ సక్సేనా, సోనూ సూద్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించి మెప్పించారు.

Next Story