శ్రీదేవి ఫొటో రిలీజ్ చేసిన చిత్రబృందం.. నిజమైన ‘దేవకన్య’ అంటూ ఫ్యాన్స్ ట్వీట్స్

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-05 16:05:34  IST  )

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) - శ్రీదేవి(Sridevi) కాంబినేషన్‌లో వచ్చిన జగదేకవీరుడు-అతిలోక సుందరి(Jagadeka Veerudu Athiloka Sundari) సినిమాను చిత్రబృందం రీరిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.

శ్రీదేవి ఫొటో రిలీజ్ చేసిన చిత్రబృందం.. నిజమైన ‘దేవకన్య’ అంటూ ఫ్యాన్స్ ట్వీట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) - శ్రీదేవి(Sridevi) కాంబినేషన్‌లో వచ్చిన జగదేకవీరుడు-అతిలోక సుందరి(Jagadeka Veerudu Athiloka Sundari) సినిమాను చిత్రబృందం రీరిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ ఫ్యాన్స్ డిమాండ్స్ మేరకు మే 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అనేక థియేటర్లలో ఈ సినిమాను గ్రాండ్‌గా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ శ్రీదేవికి సంబంధించిన ఫొటోను నిర్మాతలు విడుదల చేశారు. శ్రీదేవి దేవకన్యలా ఉన్న ఫొటోను రిలీజ్ చేశారు. శ్రీదేవి డెడికేషన్ వేరే.. ఎవరికీ లేదు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో నిజమైన దేవకన్య అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాను బిగ్ స్క్రీన్స్‌పై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమాను ‘వైజయంతీ మూవీస్‌’ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. చిరంజీవి, శ్రీదేవి జంటగా రాఘవేంద్రరావు తెరకెక్కించారు. 1990 మే 9న విడుదలై ఈ సినిమా.. సరిగ్గా 35 తర్వాత రీరిలీజ్ చేస్తుండటంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఇటీవల సినిమా షూటింగ్ సమయంతో చోటుచేసుకున్న పలు ఆసక్తికర సంఘటనలను మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అశ్వినీదత్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

Next Story