- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అఖండ 2’ మూవీ రిలీజ్.. థియేటర్ వద్ద ఘర్షణ.. ఆ విషయంలో మొదలైన గొడవ, చివరికి!?
నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘అఖండ 2’.

దిశ,వెబ్‌డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘అఖండ 2’. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యమైన విషయం తెలిసిందే. దీంతో బాలకృష్ణ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అఖండ 2 విడుదలవుతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఎట్టకేలకు ఈరోజు(డిసెంబర్ 12) అఖండ 2 మూవీ థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.
ఇదిలా ఉంటే.. నిన్న(గురువారం) రాత్రి ప్రీమియర్ షోలు కూడా మొదలయ్యాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని నందమూరి బాలయ్య అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేశారు. ఈ తరుణంలో బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ ప్రీమియర్ షో ప్రదర్శిస్తున్న థియేటర్ వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. తిరుపతి జిల్లా పలమనేరులోని ఓ థియేటర్ లో ఆన్‌లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులను లోనికి పంపకపోవడంతో రచ్చ మొదలైంది. కాసేపు థియేటర్ సిబ్బంది, బాలయ్య ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని గొడవను శాంతింపజేశారు.
Read More..






